ఓట్ల గల్లంతు నిజమేనని ద్వివేదీ ఒప్పుకున్నారు: గంటా
- ప్రారంభంలో 20 నుంచి 30 శాతం ఈవీఎంలు పని చేయలేదు
- అధికారులను మార్చి భయానక వాతావరణాన్ని సృష్టించారు
- 125 సీట్లను టీడీపీ గెలవబోతోంది
మళ్లీ ప్రజా ప్రభుత్వానికే ఓటర్లు పట్టం కట్టబోతున్నారని గంటా చెప్పారు. 125 సీట్లతో టీడీపీ ఘన విజయం సాధించబోతోందని తెలిపారు. ఓటర్లు ఇబ్బంది పడకూడదనే టీడీపీ పోరాటం చేస్తోందని చెప్పారు. పోలింగ్ రోజున ఓటర్ల నుంచి వచ్చిన అనూహ్య స్పందన వారి బాధ్యతకు నిదర్శనమని అన్నారు.