పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. దగ్గరైతే రేప్ కిందే లెక్క: సుప్రీంకోర్టు కీలక తీర్పు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. దగ్గరైతే రేప్ కిందే లెక్క: సుప్రీంకోర్టు కీలక తీర్పు

  • పెళ్లి పేరిట నమ్మించి సహజీవనం
  • పదేళ్ల శిక్షను ఖరారు చేసిన హైకోర్టు
  • ఏడేళ్లకు తగ్గిస్తూ, సుప్రీంకోర్టు చివాట్లు
పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి, యువతి అంగీకారంతోనే అయినా శారీరకంగా కలసి, ఆపై పెళ్లికి నిరాకరిస్తే, అది అత్యాచారమేనని సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, చత్తీస్ గఢ్ లో ఓ యువతికి, అనురాగ్ సోనీ అనే యువకుడికి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆమెను పెళ్లిచేసుకుంటానని నమ్మించగా, సహజీవనం చేసింది. ఆపై అతను ముఖం చాటేయడంతో కోర్టును ఆశ్రయించింది. ట్రయల్ కోర్టులో పదేళ్ల జైలు శిక్ష పడగా, నిందితుడు దాన్ని హైకోర్టులో సవాల్ చేశాడు. అక్కడా చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

దీంతో జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వర రావు, జస్టిస్‌ ఎమ్‌ఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం కేసును విచారించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు కాబట్టి, శారీరక కలయికకు ఆమె సమ్మతిని సాధారణ అనుమతిగా పరిగణించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. లైంగికంగా కలిసేందుకు ఆమె అంగీకరించినా అది అత్యాచారమేనని, హత్య కన్నా రేప్ అత్యంత దారుణమైనదని చివాట్లు పెట్టింది, నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.
Supreme Court
Marriage
Rape
Rulling

More Telugu News