సూర్య తాజా చిత్రం నుంచి టైటిల్ పోస్టర్

  • సూర్య తాజా చిత్రంగా 'సూరారై పొట్రు'
  • కథానాయికగా 'అపర్ణ బాలమురళి' 
  • త్వరలోనే మిగతా వివరాలు
సూర్య వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కథాకథనాల్లోను .. తన పాత్రకి సంబంధించిన లుక్ విషయంలోను ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు. ఒక సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే .. మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు. సెట్స్ పై వున్న సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకోగానే మరో ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు.

అలా ఆయన ఎంతమాత్రం గ్యాప్ లేకుండా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన 'గురు' ఫేమ్ సుధా కొంగరకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తాజాగా ఈ సినిమాకి 'సూరారై పొట్రు' అనే టైటిల్ ఖరారు చేసి, టైటిల్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో సూర్య సరసన నాయికగా 'అపర్ణ బాలమురళి'ని తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి. 
Go Back to Shorts
surya
aparna

More Telugu News