లక్ష్మీపార్వతిపై చేసిన ఆరోపణలు పక్కా ప్లాన్: రామ్ గోపాల్ వర్మ అనుమానం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లక్ష్మీపార్వతిపై చేసిన ఆరోపణలు పక్కా ప్లాన్: రామ్ గోపాల్ వర్మ అనుమానం

  • లక్ష్మీపార్వతికి క్లాసికల్ మ్యూజిక్ అంటే ఇష్టం
  • పాటలు నింపుతానని ఆమె ఫోన్ ని తీసుకున్నాడు
  • ఆ ఫోన్ నుంచి అతని ఫోన్ కు మెస్సేజ్ లు పంపుకున్నాడు
లక్ష్మీపార్వతిపై కోటి అనే వ్యక్తి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమెపై వచ్చిన ఈ ఆరోపణల గురించి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద ప్రస్తావించగా ఆయన స్పందించారు. ‘సాక్షి’ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ, ఇలాంటి వాటి గురించి తాను ఎక్కువగా పట్టించుకోనని అన్నారు. ఇదంతా పక్కా ప్లాన్ గా జరిగిందన్న అనుమానం వ్యక్తం చేశారు. లక్ష్మీపార్వతికి కర్ణాటక శాస్త్రీయ సంగీతం అంటే చాలా ఇష్టమని, ఇందుకు సంబంధించిన పాటలు ఆమె ఫోన్ లో లోడ్ చేస్తానని చెప్పి ఆమె ఫోన్ ని తీసుకుని, వాళ్లిద్దరి మధ్య సంభాషణ జరిగినట్టుగా ఆమె ఫోన్ నుంచి అతని ఫోన్ కు మెస్సేజ్ లు పంపుకుని, ఆ తర్వాత ఆమె ఫోన్ లో మెస్సేజ్ లను డిలీట్ చేశాడని అన్నారు.

నాలుగేళ్లుగా ఆమెతో పరిచయం ఉందని చెబుతున్న అతను ఈ పని ఎందుకు చేస్తాడు? అతనితో ఎవరో చేయించి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేశారు. వాళ్లిద్దరి మధ్య జరిగిన ఓ ఆడియో రికార్డును గురించి ప్రస్తావిస్తూ, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు ఒకట్రెండు రోజుల ముందు ఈ రికార్డింగ్ చేశాడని, కావాలని చెప్పి ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆమెతో మాట్లాడించారన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఆడియో రికార్డింగ్ లో ఎక్కడా కూడా లక్ష్మీపార్వతిపై అతను ఏవైతే ఆరోపణలు చేశాడో అలాంటి భావాలు వ్యక్త పరుస్తున్నట్టుగా ఆమె మాట్లాడలేదన్న విషయం స్పష్టంగా తెలిసిపోతుందని అన్నారు. వందశాతం ఈ ఆడియో రికార్డింగ్ కావాలని సృష్టించిందేనని వర్మ స్పష్టం చేశారు. 
Tollywood
Lakshmi`s NTR
Ramgopal varma
director

More Telugu News