మేము ఎవరినీ కిడ్నాప్ చేయలేదు.. భూమా కుటుంబమే మాపై దాడి చేసింది: గంగుల
- కిడ్నాప్ చేయాల్సిన అవసరం మాకు లేదు
- ఓటమి భయంతో భూమా కుటుంబం తప్పుడు ఆరోపణలు చేస్తోంది
- ఆధారాలు ఉంటే చూపించాలి
ఈ అంశంపై గంగుల స్పందించారు. తాము ఎవరినీ కిడ్నాప్ చేయలేదని, ఆ అవసరం కూడా తమకు లేదని ఆయన అన్నారు. ఓటమి భయంతోనే భూమా కుటుంబం తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. తాము కిడ్నాప్ చేసినట్టు ఆధారాలను చూపించాలని డిమాండ్ చేశారు. వాళ్ల మనుషులు కిడ్నాప్ అయి ఉంటే ఇంతవరకు పోలీస్ స్టేషన్ లో ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. అహోబిలంలో తమపై దాడి చేసింది భూమా అనుచరులేనని ఆరోపించారు.