రాళ్లదాడిలో భూమా అఖిలప్రియ భర్త, చెల్లికి గాయాలు

  • ఆళ్లగడ్డ జిల్లా అహోబిలంలో భూమా, గంగుల వర్గీయుల మధ్య ఘర్షణ
  • రాళ్లు రువ్వుకున్న వైనం
  • హుటాహుటిన అహోబిలం చేరుకున్న అఖిలప్రియ
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ సందర్భంగా అహోబిలంలో భూమా, గంగుల వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గీయులు సరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ రాళ్ల దాడిలో మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్, ఆమె చెల్లెలు మోనికకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘర్షణ నేపథ్యంలో, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. సమాచారం అందుకున్న అఖిలప్రియ హుటాహుటిన అహోబిలం చేరుకున్నారు.
Go Back to Shorts
akhilapriya
gangula
allagadda
ahobilam
Telugudesam
ysrcp

More Telugu News