Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బైక్ వెనక సీట్లో కూర్చుని హెల్మెట్ పెట్టుకోలేదంటూ నటి సారా అలీఖాన్‌పై ఫిర్యాదు

  • సినిమా షూటింగ్‌లో భాగంగా బైక్‌పై షికారు
  • సోషల్ మీడియాలో ట్రోల్ 
  • చర్యలు తప్పవన్న పోలీసులు
బాలీవుడ్ నటి సారా అలీఖాన్‌పై ఢిల్లీలో పోలీసు కేసు నమోదైంది. బైక్ వెనక సీట్లో కూర్చుని ప్రయాణిస్తున్న ఆమె హెల్మెట్ పెట్టుకోలేదన్నది ఆ ఫిర్యాదు సారాంశం. కార్తీక్ ఆర్యన్ బైక్ డ్రైవ్ చేస్తుండగా సారా వెనక కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ‘లవ్ ఆజ్ కల్’ సినిమాకు సీక్వెల్ చిత్రీకరణ కోసం సారా ఢిల్లీ వచ్చిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.  గతేడాది విడుదలైన కేదార్‌నాథ్ సినిమాతో సారా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ఆమె ఏదో ఒక కారణంతో నిత్యం వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది.

తాజాగా షూటింగ్‌లో భాగంగా ఆమె సహ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఢిల్లీ వీధుల్లో బైక్‌పై షికారు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, అంతకుమించి ట్రోల్ అయింది. బైక్‌పై వెనక కూర్చున్నప్పటికీ హెల్మెట్ పెట్టుకోకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెపై చర్యలు తప్పవని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
sara ali khan
Bollywood
karthik aryan
New Delhi

More Telugu News