Gutti: ఈవీఎంను నేలకేసి కొట్టిన జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా... అరెస్ట్!

  • నియోజకవర్గం పేరు సరిగా రాయలేదని ఆగ్రహం
  • ఇతర పార్టీల ఏజంట్లు, అధికారులతో గొడవ
  • పోలింగ్ ఆఫీసర్ ఫిర్యాదుతో అరెస్ట్
అనంతపురం జిల్లా గుత్తి బాలికోన్నత పాఠశాలలోని 183వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా నిర్వాకం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఉదయం పోలింగ్ ప్రారంభమైన కాసేపటికి బూత్ లోపలికి వచ్చిన మధుసూదన్ గుప్తా, అక్కడున్న ఇతర పార్టీల ఏజంట్లతో గొడవ పడటమే కాకుండా, ఈవీఎంను నేలకేసి కొట్టారు. దీంతో అది పని చేయకుండా పోయింది. అంతకుముందు ఆయన ఓటింగ్ కంపార్ట్ మెంట్లలో నియోజకవర్గం పేరును సరిగా రాయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  పోలింగ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు మధుసూదన్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Gutti
Jana Sena
Arrest
Madhusudangupta

More Telugu News