Sharmila: వైఎస్ షర్మిల ప్రచారరథం ఢీకొని ఒకరు మృతి!

  • నెల్లూరు జిల్లా మర్రిపాడు వద్ద ప్రచారం
  • లారీని ఢీకొన్న ప్రచారరథం
  • ముగ్గురికి గాయాలు
వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచార రథం అదుపుతప్పి ఓ లారీని ఢీకొనగా, ఒకరు మృతిచెందారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పరిధిలోని కృష్ణాపురం వద్ద బుధవారం జరిగింది. షర్మిల ఎన్నికల ప్రచారం తరువాత విజయవాడ నుంచి పులివెందులకు ప్రచారరథం బయలుదేరింది.

మార్గమధ్యంలో లారీని ఢీకొనగా, కడప జిల్లా మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ నగిరి సంజీవనాయుడు (52) మృతిచెందాడు. ఇదే ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. యాక్సిడెంట్ సమయంలో ప్రచారరథంలో షర్మిల లేరు. గాయాలైనవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరించారు.
Sharmila
Campaigh
Road Accident

More Telugu News