Andhra Pradesh: ఓటరుపై చేయి చేసుకున్న వైసీపీ అభ్యర్థి కొడాలి నాని

  • డబ్బు పంపిణీ విషయంలో వైసీపీ కార్యకర్తలకు-ఓటర్లకు మధ్య గొడవ
  • మధ్యలో కల్పించుకుని చేయి చేసుకున్న నాని
  • నెల్లూరు జిల్లాలో టీడీపీ ఏజెంట్లను అడ్డుకున్న వైసీపీ
కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నాని రెచ్చిపోయారు. డబ్బుల పంపిణీ విషయంలో వైసీపీ కార్యకర్తలు, ఓటర్ల మధ్య వివాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న నాని వాగ్వివాదానికి దిగిన ఓటరుపై చేయిచేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లిలో టీడీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి వెళ్లకుండా వైసీపీ నేతలు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
Andhra Pradesh
Kodali Nani
YSRCP
gudivada
Telugudesam

More Telugu News