'బంగార్రాజు'కి నో చెప్పేసిన నయనతార
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బంగార్రాజు'కి నో చెప్పేసిన నయనతార

  • నాగార్జున హీరోగా 'బంగార్రాజు'
  • నయనతారను సంప్రదించిన కల్యాణ్ కృష్ణ 
  • వరుస సినిమాలతో నయన్ బిజీ  
ప్రస్తుతం నాగార్జున 'మన్మథుడు 2' సినిమాకి సంబంధించిన పనులతో తీరిక లేకుండా వున్నారు. ఒక వైపున ఈ సినిమా చేస్తూనే మరో వైపున 'బంగార్రాజు' ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో వున్నారు. 'సోగ్గాడే చిన్నినాయనా' చేసిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే నాగార్జున 'బంగార్రాజు' చేయనున్నారు. ఈ నెల చివరిలో గానీ .. వచ్చేనెల మొదట్లో గాని అయన ఈ సినిమాను లాంచ్ చేసే ఆలోచనలో వున్నారు.

ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం నయనతారను సంప్రదించారట. అయితే డేట్స్ లేని కారణంగా ఈ సినిమా తాను చేయలేనని నయనతార చెప్పినట్టుగా తాజా సమాచారం. ప్రస్తుతం నయనతార తెలుగులో చిరంజీవి సరసన 'సైరా' చేస్తోంది. అలాగే తమిళంలోను ఒక సినిమా చేస్తోంది. ఇక తాజాగా రజనీ సరసన 'దర్బార్'కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందువల్లనే డేట్స్ లేవని ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది. దాంతో 'బంగార్రాజు' జోడీగా మరో సీనియర్ హీరోయిన్ కోసం అన్వేషణ మొదలుపెట్టారట. 
nagarjuna

More Telugu News