చంద్రబాబు కొత్త నాటకాలకు తెరదీశారు: జీవీఎల్

  • అధికారుల బదిలీపై బాబు రాజకీయం చేస్తున్నారు
  • గెలుపు కోసం వేల కోట్లను టీడీపీ వెదజల్లుతోంది
  • చంద్రబాబు డ్రామాలకు అంతు లేకుండా పోయింది
సత్తెనపల్లిలో టీడీపీ తరపున పోలీసులే డబ్బు పంపిణీ చేస్తున్నారని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేదికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం, ఎంపీ జీవీఎల్ నరసింహారావు  మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో గెలిచేందుకు వేల కోట్ల రూపాయలను టీడీపీ వెదజల్లుతోందని, చంద్రబాబు కొత్త నాటకాలకు తెరదీశారని ఆరోపించారు. కొద్ది మంది అధికారులను ఈసీ బదిలీ చేస్తే చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

 ఓటమి భయంతోనే చంద్రబాబు ఈ డ్రామాలకు తెరలేపారని, రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఏపీలో జరుగుతున్నవి ఐటీ దాడులు కాదని, పోలీసుల సోదాలేనని అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతలు కావాలని చెప్పే తమ ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు చేయించుకుంటున్నారని, చంద్రబాబు డ్రామాలకు అంతు లేకుండా పోయిందని, గోబెల్స్ ప్రచారంలో టీడీపీ మొదటి స్థానంలో ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
bjp
Gvl
sattenapalli

More Telugu News