టీడీపీ నేత బోండా ఉమపై కేసు పెట్టండి.. ఏపీ పోలీసులకు హైకోర్టు ఆదేశం!
- న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సాయిశ్రీ తల్లి
- తన కుమార్తె చావుకు ఆయనే కారణమని ఆరోపణ
- మూడుసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు పెట్టలేదని వ్యాఖ్య
విజయవాడ నగరంలోని దుర్గాపురంలో ఉన్న సుమశ్రీ ఇంటిని బోండా ఉమ, మాదంశెట్టి శివకుమార్ లాక్కోవడంతోనే ఆమె కుమార్తె సాయిశ్రీ కేన్సర్ చికిత్సకు డబ్బులు లేక 2017, మే 14న చనిపోయిందని ఆరోపించారు. బోండా ఉమతో సుమశ్రీ ప్రాణాలకు ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. వాదనలు విన్న ధర్మాసనం బోండా ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.