ఏపీ ప్రయాణికులకు షాక్.. చివరి నిమిషంలో 125 బస్సులను రద్దు చేసిన కావేరి ట్రావెల్స్
- సొంతూళ్లకు పయనమవుతున్న హైదరాబాద్లోని ఏపీ వాసులు
- మొత్తంగా నిలిచిపోయిన 200 బస్సులు
- తలలు పట్టుకుంటున్న ప్రయాణికులు
దీనికి తోడు తెలంగాణలో లైసెన్స్ లేదన్న కారణంతో తెలంగాణ ఆర్టీఏ అధికారులు మరికొన్ని ట్రావెల్స్ బస్సులను రద్దు చేశారు. దీంతో మొత్తంగా 200 వరకు బస్సులు నిలిచిపోయాయి. బస్సులు రద్దయ్యాయంటూ ప్రైవేటు యాజమాన్యాలు ప్రయాణికులకు మెసేజ్లు పంపడంతో ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.