త్రివిక్రమ్ .. బన్నీ సెట్స్ పైకి వెళ్లే తేదీ ఖరారైపోయింది

08-04-2019 Mon 16:07 | Entertainment
  • త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ 
  • ఈ నెల 24 నుంచి రెగ్యులర్ షూటింగు
  • సంగీత దర్శకుడిగా తమన్ 
విభిన్నమైన కథ కోసం .. విలక్షణమైన పాత్ర కోసం అల్లు అర్జున్ కొంతకాలంగా వెయిట్ చేస్తూ వచ్చాడు. త్రివిక్రమ్ వినిపించిన కథ నచ్చడంతో ఓకే చేసేశాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలు భారీ విజయాలను అందుకోవడంతో, సహజంగానే ఈ ప్రాజెక్టుపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అంతా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ రోజున అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ విషయాన్ని ప్రకటించారు. అల్లు అర్జున్ కి ఇది 19వ సినిమా. హారిక అండ్ హాసిని .. గీతా ఆర్ట్స్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. 
trivikramallu arjun

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more