ముదపాకలో నాకు సెంటు భూమి ఉందని నిరూపించినా నీకే రాసిస్తా: పవన్ కల్యాణ్ కు బండారు సవాల్
- జనసేనాని ఆరోపణలపై తీవ్రస్థాయిలో మండిపాటు
- తప్పని నిరూపిస్తే క్షమాపణ చెప్పాలని డిమాండ్
- నీ గురించి నేను మాట్లాడితే తట్టుకోలేవని హెచ్చరిక
ఆదివారం సాయంత్రం పెందుర్తిలో జరిగిన బహిరంగ సభలో జనసేనాని ఎమ్మెల్యే బండారు ఆక్రమణలపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై బండారు ఘాటుగా స్పందించారు. ఎవరో పేపరుపై రాసిచ్చిన అంశాలను పట్టుకుని ఆయన విమర్శలు కురిపించారని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కోరారు. ‘ఇక మీ గురించి నేను మాట్లాడడం మొదలుపెడితే మీరు తట్టుకోలేరు. నీలా నేను దిగజారి మాట్లాడను. అందుకే ఆ విషయాలు ప్రస్తావించదల్చుకోలేదు’ అంటూ బండారు సుతిమెత్తగా హెచ్చరించారు.