ఇండిగో విమానంలో చైతూ, సమంత... ఫిదా అవుతున్న నెటిజన్లు!

మూడు రోజుల క్రితం విడుదలైన 'మజిలీ' హిట్ టాక్ ను తెచ్చుకోగా, ఆనందంగా ఉన్న స్టార్ కపుల్ నాగచైతన్య, సమంతల తాజా ఫోటో ఒకటి ఇప్పుడు నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఇండిగోకు చెందిన ఓ విమానంలో వీరిద్దరూ వెళుతున్న వేళ, చైతూ తన ల్యాప్ టాప్ చూసుకుంటూ బిజీగా ఉండగా, సమంత మాత్రం తన భర్త భుజంపై తల పెట్టి నిద్రపోతోంది. ఆ సమయంలో తీసిన ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో సమంత పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "ఆఖరికి..  ఏదీ దీనికి సాటి రాదు" అన్న అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టింది. ఇక దీన్ని నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.





View this post on Instagram









In the end ... nothing else matters

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Go Back to Shorts
Naga Chaitanya
Samanta
Flight
Instagram
viral Pic

More Telugu News