Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా...వదంతులు నమ్మకండి: ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌

  • ‘నవీన్‌ జెట్‌ ఇంజిన్‌’ పేరుతో వీడియో విడుదల
  • నాపై బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు
  • ఒడిశా ప్రజల కోసం పోటీకి సిద్ధపడుతున్నాను
తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ స్పష్టమైన సందేశం పంపారు. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, ఒడిశా ప్రజల కోసం జరుగుతున్న ఎన్నికలకు సిద్ధమవుతున్నానని, ఎటువంటి వదంతులు నమ్మవద్దని కోరారు. ఈ మేరకు ‘నవీన్‌ జెట్‌ ఇంజిన్‌’ పేరుతో ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో నవీన్‌ వ్యాయామం చేస్తూ కనిపిస్తున్నారు. నవీన్‌ ఆరోగ్యంపై వదంతులు రావడంతో బీజేడీ నేతలు ఈ వీడియోను షేర్‌ చేశారు.

ఈ వీడియోలో నవీన్‌ మాట్లాడుతూ  ‘నా ఆరోగ్యంపై బీజేపీ నేతలే వదంతులు సృష్టిస్తున్నారు. కొందరైతే నా ఆరోగ్యం పూర్తి విషమంగా ఉందని, ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నానని పుకార్లు పుట్టిస్తున్నారు. అందుకే ఎన్నికల వేళ ఈ వీడియో విడుదల చేయడం తప్పనిసరని భావించి  రిలీజ్ చేస్తున్నాను’ అంటూ ముగించారు.
Odisha
naveenpatnaik
helth vedio
BJD

More Telugu News