చంద్రయాన్-2 మూన్ ల్యాండర్ కాళ్లలో లోపాలు.. ప్రయోగం వాయిదా
- చంద్రయాన్-2 ప్రాజెక్టు ఖర్చు రూ.800 కోట్లు
- డ్రాప్ టెస్టులో లోపాలను గుర్తించిన శాస్త్రవేత్తలు
- మే వరకు హోల్డ్‌లో ప్రయోగం
చంద్రయాన్-1లా కాకుండా చంద్రయాన్-2లో చాలా ప్రత్యేకతలున్నాయి. ఇందులో భాగంగా చంద్రుడిపై ఓ రోవర్‌ను దింపుతారు. మరో ఉపగ్రహం చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తుంది. చంద్రుడిపైకి దింపిన రోవర్లో సిస్మోమీటర్, థర్మల్ ప్రోబ్ వంటివి ఉంటాయి. అలాగే, చంద్రుడి ఉపరితలంపై ఉన్న మట్టిని పరీక్షించేందుకు స్పెక్ట్రోమీటర్‌ను కూడా ఇది మోసుకెళ్తుంది.