అల్లు శిరీశ్ మూవీ విడుదల తేదీ ఖరారు
- అల్లు శిరీశ్ హీరోగా 'ఏబీసీడీ'
- త్వరలో ట్రైలర్ రిలీజ్
- మే 17వ తేదీన సినిమా విడుదల
సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, మధుర శ్రీధర్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన వాయిదా వేసుకున్నారు. మే 17ను విడుదల తేదీగా ఖరారు చేశారు. త్వరలోనే ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈ సినిమా అయినా అల్లు శిరీశ్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి. ఈ సినిమాలో శిరీశ్ జోడీగా రుక్షార్ థిల్లోన్ నటించిన విషయం తెలిసిందే.