జీవితమంతా మందిపై పడి బతకడమేనా చంద్రబాబూ.. ఇది ఎంగిలి కూడు తినడం కాదా?: విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు
- లోకేశ్ కోసం ఓటుకు రూ.10,000 ఇస్తున్నారు
- విజయవాడ, గుంటూరులో మార్చుకునేలా కూపన్లు అందజేస్తున్నారు
- ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత
మంగళగిరిలో లోకేశ్ గెలుపు కోసం టీడీపీ నేతలు ఓటుకు రూ.10,000 పంచుతున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. నగదుకు బదులుగా కూపన్లు ఇస్తున్నారనీ, వాటిని విజయవాడ, గుంటూరులో ఫలానా వ్యక్తికి ఇస్తే డబ్బులు ఇస్తున్నారని అన్నారు. ఎన్ని తాయిలాలు ఇచ్చినా మంగళగిరిలో వైసీపీ నేత ఆర్కే గెలుపును ఆపడం చంద్రబాబు తరం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు.