కాంగ్రెస్ మేనిఫెస్టో కవర్ పేజీపై చిన్నగా రాహుల్ ఫొటో.. సోనియా అసంతృప్తి
- మేనిఫెస్టో కవర్పేజీని జనాలతో నింపేసిన వైనం
- అడుగున హస్తం గుర్తు, రాహుల్ ఫొటోలు
- మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ముభావంగా సోనియా
మంగళవారం జరిగిన మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు సోనియా నిరాకరించారు. కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడడానికి కూడా ఆమె నిరాకరించారు. అయితే, పార్టీ సీనియర్ నేతలైన మన్మోహన్ సింగ్, చిదంబరం వంటి వారు మాట్లాడారు. మేనిఫెస్టో కవర్ పేజీని జనాలతో నింపేసి కింద మాత్రం కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన హస్తం, ఆ పక్కన రాహుల్ గాంధీ ఫొటోలను ముద్రించారు.