ఎన్టీఆర్ కు వెన్నుపోటు కాదు.. వెన్నుపోటు పొడిపించుకుంది చంద్రబాబే: డాక్టర్ కుసుమ రావు
- ఎన్టీఆర్ కు ఎంతో ఛరిష్మా ఉండేది
- అయితే, అడ్మినిస్ట్రేషన్ మొత్తం చంద్రబాబే చూసుకునేవారు
- ఉదయం 5 గంటలకల్లా రాకపోతే ఎన్టీఆర్ నుంచి బాబుకు కబురు వచ్చేది
ఎన్టీఆర్ కు ఏ ఆలోచన వస్తే అది జరిగిపోవాల్సిందేనని... అయితే, ఎలాంటి సమస్యలు వచ్చినా, దాన్నంతా సరిదిద్దే బాధ్యత చంద్రబాబే చూసుకునేవారని కుసుమ తెలిపారు. సమస్యలను ఎన్టీఆర్ పిల్లలు కానీ, మరో అల్లుడు కానీ సరిదిద్దే పరిస్థితి లేదని చెప్పారు. ఏ టు జెడ్ చంద్రబాబే చూసుకోవాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. అలాంటి చంద్రబాబును లక్ష్మీపార్వతి సూచన మేరకు అన్ని పదవులకు ఎన్టీఆర్ దూరం పెట్టారని... నిజంగా చెప్పాలంటే వెన్నుపోటుకు గురైంది చంద్రబాబేనని చెప్పారు.