అందుకే మేమంటే మీకు కుళ్లు: ప్రధానిపై చంద్రబాబు
- నాకు పాఠాలు నేర్పిస్తారా?
- రాజకీయాల్లోకి నేనెప్పుడొచ్చా.. మీరెప్పుడొచ్చారు?
- అసలైన యూటర్న్ మీదే
అమరావతిని అహ్మదాబాద్ కంటే అద్భుతంగా నిర్మిస్తున్నామన్న కుళ్లుతోనే తనపై లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనది యూటర్న్ కాదని, రైట్ టర్న్ అని చంద్రబాబు మరోమారు పేర్కొన్నారు. రాష్ట్రానికి హోదా ఇస్తారన్న నమ్మకంతో మిత్రపక్షంగా ఉంటే దానిని తోసిపుచ్చి మోసం చేశారని అన్నారు. రాష్ట్రప్రయోజనాల కోసమే ఎన్డీయే నుంచి బయటకు వచ్చామన్నారు. తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని మర్చిపోయిన మీదే అసలైన యూటర్న్ అని ఆరోపించారు.