Amitabh Bachchan: అమితాబ్ సరసన రమ్యకృష్ణ

  • తమిళ సినిమాలో తొలిసారిగా అమితాబ్
  • కీలకమైన పాత్రలో ఎస్.జె. సూర్య
  • కీలక సన్నివేశాల చిత్రీకరణ  
విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలతో అమితాబ్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే వస్తున్నారు. హిందీలో వరుస సినిమాలు చేస్తూ వస్తోన్న ఆయన, తెలుగులోను 'సైరా' సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక తొలిసారిగా తమిళంలో తనే ప్రధానమైన పాత్రగా ఒక సినిమా చేయడానికిగాను ఆయన రంగంలోకి దిగారు. 'ఉయర్నత మణిదాన్' పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకి తమిళవాణన్ దర్శకుడు.

ప్రస్తుతం కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో నటుడు .. దర్శకుడు ఎస్.జె. సూర్య ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాలో అమితాబ్ సరసన రమ్యకృష్ణను ఎంపిక చేసుకున్నారేది తాజా సమాచారం. కథాపరంగా ఈ పాత్రకి ఎంతో ప్రాధాన్యత వుంటుందట. అందువల్లనే రమ్యకృష్ణను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. తమిళంతో పాటు హిందీలోనూ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట.
Amitabh Bachchan
ramyakrishna

More Telugu News