Chandrababu: ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకునే నీచ మనస్తత్వం మోదీ సొంతం: చంద్రబాబు మండిపాటు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టీడీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నంలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిని మోదీ అడ్డుకున్నారని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చినా, దాని ప్రయోజనాలు పరిమితం అని అన్నారు. విశాఖ విమానాశ్రయం అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు, భోగాపురం విమానాశ్రయానికి గండికొట్టారని మండిపడ్డారు. విశాఖపట్నం ఎయిర్ షోను చివరి నిమిషంలో రద్దు చేసింది ప్రధాని నరేంద్ర మోదీయేనని చంద్రబాబు ఆరోపించారు.

ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకునే నీచ మనస్తత్వం మోదీ సొంతం అని చంద్రబాబు విమర్శించారు. మోదీ మనసు నిండా అసూయ, ద్వేషాలు ఉంటాయని, ఆయన ఏనాడూ చేసేది చెప్పరు, చెప్పింది చెయ్యరు అని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా పడదని, మోదీ ఓటమి ఖాయమని చెప్పారు.
Chandrababu
Narendra Modi

More Telugu News