ఒక్కొక్కరికి రూ.30 కోట్లు ఇస్తేనే టీఆర్ఎస్ లోకి వెళుతున్నారు: విజయశాంతి
- డబ్బుకు లొంగి పార్టీలు మారుతున్నారు
- ప్రజలే నిలదీయాలి
- రాహుల్ వస్తేనే దేశం బాగుపడుతుంది
పార్టీలు మారేటప్పుడు ఏదో ఒక సాకు చెప్పాలి కాబట్టి నాయకత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అయినా, వచ్చిన వాళ్లందరినీ చేర్చుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ, కారుకు లోడు ఎక్కువైతే ప్రమాదం జరుగుతుందన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. అంతేకాకుండా, దేశంలో మోదీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, రాహుల్ గాంధీ వస్తేనే దేశం బాగుపడుతుందని అన్నారు.