చంద్రబాబు సభలకు జనాలు రావడం లేదు.. ఇళ్లలోకి పారిపోయి తలుపులు వేసుకుంటున్నారు!: విజయసాయిరెడ్డి సెటైర్లు
- చంద్రబాబు ప్రలోభాలకు తెరతీశారు
- యువకులకు బైకులు, మహిళలకు పసుపు-కుంకుమ ఇస్తున్నారు
- టీడీపీ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకోవాలని పిలుపు
ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘చంద్రబాబు సభలకు జనాలు రావడం లేదు. ప్రచార వాహనాలు గ్రామాలకు వెళితే ప్రజలు తలుపులు మూసుకుంటున్నారు. దాంతో ప్రలోభాలకు తెరతీశాడు. పసుపు కుంకుమ చీరలు, యువకులకు బైకులు, స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నాడు. అన్నీతీసుకోండి. ఎందుకంటే మీనుంచి దోచుకున్నడబ్బే. ఓటు ఫ్యాను గుర్తుకు వేయండి’ అని ట్వీట్ చేశారు.