Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆసక్తిని రేపుతోన్న నితిన్ 'భీష్మ' ప్రీ లుక్

  • వెంకీ కుడుములతో 'భీష్మ'
  • యూత్ కి నచ్చే రొమాంటిక్ లవ్ స్టోరీ
  • కథానాయికగా రష్మిక మందన 
యువ కథానాయకుల రేసులో ఎంతమాత్రం వెనకబడకుండా నితిన్ తన దూకుడు కొనసాగిస్తూనే వస్తున్నాడు. పరాజయాలు ఎదురైనా డీలాపడిపోకుండా మళ్లీ హిట్ కొట్టేస్తూ పైకి లేస్తున్నాడు. అలా ప్రస్తుతం ఆయన 'భీష్మ' సినిమాతో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ రోజున నితిన్ పుట్టినరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'భీష్మ' నుంచి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు.

ప్రీ లుక్ పోస్టర్ ను బట్టి .. ఇది యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. టైటిల్ ను .. పోస్టర్ ను డిజైన్ చేసిన తీరు బాగుంది. 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, నితిన్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడనే విషయం ప్రీ లుక్ పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో, రష్మిక కథానాయికగా అలరించనుంది.
nithin
rashmika

More Telugu News