ఆసక్తిని రేపుతోన్న నితిన్ 'భీష్మ' ప్రీ లుక్
- వెంకీ కుడుములతో 'భీష్మ'
- యూత్ కి నచ్చే రొమాంటిక్ లవ్ స్టోరీ
- కథానాయికగా రష్మిక మందన
ప్రీ లుక్ పోస్టర్ ను బట్టి .. ఇది యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. టైటిల్ ను .. పోస్టర్ ను డిజైన్ చేసిన తీరు బాగుంది. 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, నితిన్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడనే విషయం ప్రీ లుక్ పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో, రష్మిక కథానాయికగా అలరించనుంది.