ఆంధ్రాపై ఇంత అక్కసా?: మోదీ వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం
- మోదీ సన్ సెట్ వ్యాఖ్యలపై ఆగ్రహం
- ఏపీపై మళ్లీ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు
- అమరావతిలో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీకి ఇచ్చిన నిధుల విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ శ్వేతపత్రం విడుదల చేసేందుకు మోదీ ముందుకు రాకపోతే, తానే రాష్ట్రం తరఫున విడుదల చేస్తానని వ్యాఖ్యానించారు. మోదీ సభకు వైసీపీ కార్యకర్తలను తరలించారనీ, తద్వారా బీజేపీ-వైసీపీ బంధం మరోసారి బయటపడిందని దుయ్యబట్టారు.
ఇక ప్రజల్లో మనకు అనుకూలత ఉంది కదా.. అని అతివిశ్వాసానికి పోవద్దని చంద్రబాబు టీడీపీ శ్రేణులకు సూచించారు. చివరివరకూ బాగా కష్టపడాలని దిశానిర్దేశం చేశారు. ఈసారి ఎన్నికల నేపథ్యంలో ఇన్ చార్జీల వ్యవస్థ ఉండదనీ, టీడీపీని ఏకపక్షంగా గెలిపించాలని ప్రజలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ‘ఎమ్మెల్యేలు అవుతున్నాం, మనకు ఏమీ ఢోకా లేదు’ అనే భావన ఎవ్వరిలోనూ ఉండరాదన్నారు. నేతలు-కార్యకర్తలు కలిసి పనిచేసినప్పుడే గెలుపు ఏకపక్షమవుతుందని తెలిపారు.