కాంగ్రెస్‌కు ఓటేస్తే మిమ్మల్ని కుక్కలు కూడా దేఖవు: తుమ్మల వివాదాస్పద వ్యాఖ్యలు

  • మొన్న నన్ను గెలిపిస్తే పాలేరును నంబర్ వన్ చేద్దామనుకున్నా
  • మీరు కాంగ్రెస్‌కు వేసిన ఓట్లు మురుగు కాల్వలో కలిసిపోయాయి
  • మళ్లీ ఇప్పుడా తప్పు చేయొద్దు
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే పాలేరును రాష్ట్రంలోనే నంబర్ వన్ చేద్దామని భావించానని, కానీ తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్‌కు ఓటేస్తే ఖమ్మం జిల్లా ప్రజలు మాత్రం కాంగ్రెస్‌ను గెలిపించారన్న ఆయన.. ఇప్పుడా ఓట్లన్నీ మురిగిపోయి మురుగు కాల్వలో కలిసిపోయాయన్నారు. అప్పుడు కాంగ్రెస్‌కు ఓటేసిన వాళ్లు ఇప్పుడు కుమిలిపోతున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ఆ పొరపాటు చేయొద్దని, అదే జరిగితే మిమ్మల్ని కుక్కలు కూడా దేఖవు (చూడవు) అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Congress
TRS
Khammam District
tummala nageswara rao
Telangana

More Telugu News