‘వీ చాట్’లో ఎంతమంది మిత్రులను చేసుకుంటే అన్ని మార్కులు ఇస్తామన్న ప్రొఫెసర్.. మండిపడుతున్న తల్లిదండ్రులు
- మిత్రుల పరిధిని బట్టి మార్కులు
- 1667 మందిని మిత్రులుగా చేసుకుంటే A+ గ్రేడ్
- ప్రొఫెసర్‌ను వెనకేసుకొస్తున్న వర్సిటీ
మిత్రుల పరిధిని బట్టి మార్కులను కూడా నిర్ణయించారు. 1667 మందిని మిత్రులుగా చేసుకుంటే ఏ ప్లస్ గ్రేడ్ ఇస్తానని, 1001 మందిని మిత్రులుగా చేసుకుంటే 100కు 60 మార్కులు ఇస్తానని తెలిపారు. ఈ విషయం కాస్తా బయటకు తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆన్లైన్ కోర్సులో ఇదీ ఒక భాగమని యూనివర్సిటీ తమ ప్రొఫెసర్‌ను వెనకేసుకు రావడం విశేషం. ఈ అసైన్మెంట్ను కొందరు విద్యార్థులు అవలీలగా చేస్తుంటే, మరికొందరు విద్యార్థులు అసైన్మెంట్ చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.