pooja hegde: ఆ సినిమా ఒప్పుకోవడమే నేను చేసిన పెద్దతప్పు: పూజా హెగ్డే

జీవితంలో విజయాలను సాధించడం వెనుక .. అపజయాలను పొందడం వెనుక ఒక నిర్ణయమనేది తప్పకుండా ఉంటుంది. తీసుకున్న నిర్ణయమే జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అలాంటి నిర్ణయం తీసుకోవడంలో తాను తొందర పడటం వల్లనే తన కెరియర్ ఇంతగా మందగించిందని తాజా ఇంటర్వ్యూలో పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.

'మొహంజొదారో' భారీ బడ్జెట్ చిత్రం .. అగ్రకథానాయకుడు హృతిక్ రోషన్ సరసన ఛాన్స్ .. అందువల్లనే ఈ అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా హిట్ అయితే కెరియర్ కి తిరుగుండదని భావించి, రెండేళ్ల పాటు కాల్షీట్స్ కేటాయించాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఆ సినిమా పరాజయం పాలుకావడం .. నా కెరియర్ పై తీవ్రమైన ప్రభావం చూపించింది. ఆ సినిమాకి బదులుగా చిన్న సినిమాలు చేసినా బాగుండేదేమో. ఒక ఆర్టిస్ట్ కి రెండేళ్ల కాలం ఎంత విలువైందనేది ఇప్పుడు తెలుస్తోంది" అంటూ చెప్పుకొచ్చింది.
pooja hegde

More Telugu News