రాజమౌళి సినిమా సెట్లోకి అడుగుపెట్టబోతోన్న అందాల భామలు
- షూటింగు దశలో రాజమౌళి మూవీ
- తదుపరి షెడ్యూల్ నార్త్ ఇండియాలో
- 2020 జూలై 30వ తేదీన విడుదల
ఈ సినిమాలో చరణ్ జోడీగా ఆలియా భట్ ను .. ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గార్ జోన్స్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కూడా నార్త్ ఇండియాలో ప్లాన్ చేసిన షూటింగులో జాయిన్ కానున్నారని చెబుతున్నారు. ఇక ముఖ్యమైన పాత్రల కోసం అజయ్ దేవగణ్ ను .. సముద్రఖనిని తీసుకోగా .. ఇతర పాత్రల కోసం మరికొంతమంది స్టార్ల పేర్లు వినిపిస్తున్నాయి. 2020 జూలై 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.