Anantapur District: బాబు రోడ్డు షో సందర్భంగా కూలిన గోడ...పలువురికి గాయాలు

  • అనంతపురం సప్తగిరి సర్కిల్‌ వద్ద ప్రమాదం
  • కూలిన మసీదు కాంప్లెక్స్‌ వరండా పైభాగం
  • కింద నిల్చున్న వారికి గాయాలు
అనంతపురం జిల్లా కేంద్రంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం సందర్భంగా స్వల్ప  ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పాత కట్టడం వరండా పైకప్పు కూలిపోవడంతో పలువురు గాయపడ్డారు. నిన్నరాత్రి పట్టణంలోని సప్తగిరి సర్కిల్‌లో సీఎం ప్రచార సభ జరిగింది. ఈ సభకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. సమీపంలోని మసీదు కాంప్లెక్స్‌ వరండాలో చాలామంది నిల్చుని చంద్రబాబు ప్రసంగాన్ని వింటున్నారు. అదే సమయంలో ఈ వరండా పైభాగం ఒక్కసారిగా కుప్పకూలి కింద నిల్చున్న వారిపై పడింది. దీంతో పలువురు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను సర్వజన ఆసుపత్రికి తరలించారు. పాత భవనం కావడంతో కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Anantapur District
rapthadu circle
wall fell down
Chandrababu

More Telugu News