Mahesh Babu: భారీగా పెరిగిపోయిన 'మహర్షి' నిర్మాణ వ్యయం

  • ముగింపు దశకి చేరుకున్న 'మహర్షి'
  • అనుకోకుండా పెరిగిపోయిన పనిరోజులు
  • అదనంగా భారీ ఖర్చు         
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను, మే 9వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా గురించి ఒక వార్త ఫిల్మ్ నగర్లో జోరుగా షికారు చేస్తోంది. ఈ సినిమా కోసం ఇంతవరకూ 150 రోజులు పనిచేశారట.

దాంతో సాంకేతిక నిపుణులు .. నటీనటులకు పెద్ద మొత్తంలో చెల్లించుకోవలసి వచ్చిందని సమాచారం. ఫలితంగా బడ్జెట్ భారీగా పెరిగిపోయిందని చెప్పుకుంటున్నారు. 135 నుంచి 140 కోట్ల వరకూ ఖర్చు చేశారట. ముందుగా నిర్మాతలు అనుకున్నదానికంటే చాలా ఎక్కువగానే ఖర్చు పెట్టేసినట్టు చెబుతున్నారు. ఈ స్థాయిలో ఖర్చు పెట్టడం నిర్మాతలను ఒత్తిడికి గురిచేసే విషయమేననే టాక్ వినిపిస్తోంది. కథాకథనాలతో పాటు .. నిర్మాణ వ్యయంపై కూడా మహేశ్ దృష్టి పెట్టవలసిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
Mahesh Babu
pooja hegde

More Telugu News