Srikakulam District: వైసీపీ ఎంపీ విజయసాయిపై ఎస్పీ వెంకటరత్నం ఫిర్యాదు.. పోలీసు కేసు నమోదు!

  • నాపై అసత్య ఆరోపణలు చేశారు
  • శ్రీకాకుళం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు
  • కేసును రిజిస్టర్ చేసిన పోలీసులు
తనపై అసత్య ఆరోపణలు చేశారని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ వెంకటరత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుడు ఫిర్యాదుతో ఆయన తన బదిలీకి కారణమయ్యారంటూ వెంకటరత్నం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 30 ఏళ్లుగా తాను నిజాయతీతో బతుకుతున్నానని, ఒక్క ఫిర్యాదుతో తన పరువును తీశారని ఆయన ఆరోపించారు.

ఏ తప్పూ చేయని తనను అనవసరంగా బదిలీ చేశారని అన్నారు. కాగా, వెంకటరత్నం ఫిర్యాదు మేరకు కేసును రిజిస్టర్ చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా, విజయసాయి తదితర వైసీపీ నేతల ఫిర్యాదుతో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీతో పాటు కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను ఎన్నికల కమిషన్ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలుగుదేశం, వైసీపీల మధ్య రాజకీయ దుమారం చెలరేగుతోంది.
Srikakulam District
SP
Venkataratnam

More Telugu News