బెంగళూరు సౌత్ అభ్యర్థి తేజస్వి సూర్యపై లైంగిక ఆరోపణలు.. చిక్కుల్లో బీజేపీ
- అనంత్‌కుమార్ భార్యకు బదులు తేజస్వికి బీజేపీ టికెట్
- అతడు మరో ఎంజే అక్బర్ కాబోతున్నాడంటూ కాంగ్రెస్ ఆరోపణలు
- ఆరోపణలపై స్పందించని బీజేపీ, తేజస్వి
జర్నలిస్టుపై లైంగిక ఆరోపణల కారణంగా మంత్రి ఎంజే అక్బర్ గతేడాది తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడా విషయాన్ని గుర్తుచేస్తూ తేజస్వి మరో ఎంజే అక్బర్ కాబోతున్నాడంటూ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. నిజానికి బెంగళూరు సౌత్ నుంచి ఇటీవల మృతి చెందిన కేంద్రమంత్రి అనంత్‌కుమార్ భార్య బరిలోకి దిగుతారని అందరూ భావించారు. అయితే, బీజేపీ అనూహ్యంగా బీజేపీ యూత్ వింగ్ లీడర్ తేజస్వి సూర్యను బరిలోకి దింపి అందరినీ ఆశ్చర్యపరిచింది. 28 ఏళ్ల సూర్య లాయర్. మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు.