నేడు మూడు జిల్లాల్లో జగన్ సుడిగాలి పర్యటన!
- విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరిలో ఎన్నికల ప్రచారం
- నాలుగు బహిరంగ సభల్లో ప్రసంగించనున్న జగన్
- అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన వైసీపీ నేతలు
ఈరోజు ఉదయం 9.30 గంటలకు పార్వతీపురానికి చేరుకోవడంతో జగన్ పర్యటన ప్రారంభం అవుతుంది. అనంతరం ఉదయం 11.30 గంటలకు విశాఖ జిల్లాకు చేరుకోనున్న జగన్ పాయకరావు పేటలో జరిగే సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు జగన్ తూర్పు గోదావరి జిల్లాకు చేరుకుంటారు.
అక్కడే మండపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా జగన్ నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటారని వైసీపీ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను వైసీపీ నేతలు ఇప్పటికే పూర్తిచేశారు.