22 ఎంపీ, 120 ఎమ్మెల్యే సీట్లు గ్యారెంటీ: గల్లా జయదేవ్ ధీమా
- వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం
- బీజేపీ చేతిలో జగన్ ఓ కీలుబొమ్మ
- పెదకాకానిలో గల్లా జయదేవ్ రోడ్ షో
ముస్లిం సోదరులను వైఎస్ జగన్ మోసం చేస్తున్నారని ఆరోపించిన ఆయన, భవిష్యత్తులో వైసీపీని బీజేపీలో విలీనం చేస్తారని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేస్తుంటే, ఆ పార్టీ చేతిలో జగన్ కీలుబొమ్మగా మారారని, కేసీఆర్ తో కలిసి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇండియాలో ఉన్నది రెండే కూటములని, యూపీఏ, ఎన్డీయే మినహా మరే కూటమి లేదని, ఫెడరల్ ఫ్రంట్ లో కనిపిస్తున్నది కేసీఆర్, జగన్ లు మాత్రమేనని గల్లా జయదేవ్ ఎద్దేవా చేశారు.