Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అసురన్'తో తలపడనున్న తెలుగు యంగ్ హీరో

  • తెలుగులో మంచి గుర్తింపు 
  • తమిళ 'అసురన్' నుంచి అవకాశం 
  • విలన్ గా బిజీ అయ్యే ఛాన్స్   
ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నించే తమిళ స్టార్ హీరోలలో ధనుశ్ ఒకరు. కథాకథనాల్లో కొత్తదనం .. పాత్రలో వైవిధ్యం ఉంటేనే ఆయన సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతూ ఉంటాడు. తాజాగా ఆయన మరో విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకుని రంగంలోకి దిగాడు. దొరై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి 'అసురన్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు.

ధనుశ్ పాత్రను చాలా శక్తిమంతమైందిగా తీర్చిదిద్దారు. ప్రతినాయకుడి పాత్ర కూడా అదే స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో, ఆ పాత్ర కోసం చాలామంది నటుల పేర్లను పరిశీలించారు. చివరికి నవీన్ చంద్రను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. 'అందాల రాక్షసి' .. 'త్రిపుర' .. 'నేను లోకల్' చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర, ఇక ఈ సినిమాతో యంగ్ విలన్ గా బిజీ అవుతాడేమో చూడాలి. 
dhanush
naveen chandra

More Telugu News