ప్రచారం చేస్తున్న జనసేన అభ్యర్థి సందీప్ పంచకర్లపై వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అనుచరుల దౌర్జన్యం.. వీడియో వైరల్
- రెచ్చిపోయిన అవంతి శ్రీనివాస్ అనుచరులు
- జనసేన ప్రచార రథంపైకి ఎక్కి మరీ వార్నింగ్
- భీమిలిలో తీవ్ర ఉద్రిక్తత
ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రచారంలో తాము విమర్శిస్తామని, కావాలంటే ప్రతి విమర్శలు చేసుకోవాలి తప్పితే ఇలా అందరూ చూస్తుండగా దాడులకు దిగడం సరికాదని జనసేన అభ్యర్థి సందీప్ చెబుతున్నా వినిపించుకోని అవంతి అనుచరుడు ఒకరు ఆయన మీదిమీదికి వెళ్లాడు. దీంతో పరిస్థితి అదుపుతప్పుతోందని భావించిన కొందరు నేతలు సర్దిచెప్పడంతో ఘర్షణ వాతావరణానికి ఫుల్‌స్టాప్ పడింది.