'ఎ' సర్టిఫికేట్ తెచ్చుకున్న సమంత 'సూపర్ డీలక్స్'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఎ' సర్టిఫికేట్ తెచ్చుకున్న సమంత 'సూపర్ డీలక్స్'

  • సమంత ప్రధాన పాత్రధారిగా 'సూపర్ డీలక్స్'
  • కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ 
  • ఈ నెల 29వ తేదీన విడుదల
తెలుగు, తమిళ భాషల్లో సమంత తన క్రేజ్ ను కొనసాగిస్తూనే వస్తోంది. తమిళంలో ఆమె తాజా చిత్రంగా 'సూపర్ డీలక్స్' రూపొందింది. ట్రాన్స్ జెండర్ గా విజయ్ సేతుపతి .. పోర్న్ స్టార్ గా రమ్యకృష్ణ కనిపించనుండటం విశేషం. ఫహాద్ ఫాజిల్ కూడా ఒక కీలకమైన పాత్రను పోషించాడు. తాజాగా ఈ క్రైమ్ థ్రిల్లర్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.సెన్సార్ బోర్డు నుంచి ఈ సినిమాకి 'ఎ' సర్టిఫికేట్ లభించింది. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 29వ తేదీన తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు. తెలుగులో సమంతకి .. రమ్యకృష్ణకి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది కనుక, ఈ సినిమా వసూళ్లు భారీగా వుంటాయనే నమ్మకంతో దర్శక నిర్మాతలు వున్నారు. వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.
samanta
ramyakrishna

More Telugu News