తెలుగుదేశం పార్టీ గురించి రాయండి... అనంతపురం డిగ్రీ విద్యార్థుల పొలిటికల్ సైన్స్ పేపర్ లో ప్రశ్న!
- అటానమస్ హోదాలో ఉన్న అనంతపురం ఆర్ట్స్ కాలేజ్
- డిగ్రీ సెకండియర్, పొలిటికల్ సైన్స్ పేపర్ లో ప్రశ్న
- కోడ్ ఉల్లంఘనంటున్న నెటిజన్లు
బాధ్యతాయుత ప్రభుత్వం, భారత ఉప రాష్ట్రపతి, మంత్రిమండలి, సంకీర్ణ ప్రభుత్వం, ద్విశాసన సభ, ఎన్నికల సంస్కరణలు, తెలుగుదేశం పార్టీ, పార్టీ ఫిరాయింపుల చట్టం... అంశాలను ఇస్తూ, అందులో ఐదు ఎంచుకోవాలని కోరింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, ఇలా ఓ పార్టీ గురించి రాయాలనడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని అంటూ, పలువురు విద్యార్థులు క్వశ్చన్ పేపర్ ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. కాగా, ఈ ప్రశ్నాపత్రాన్ని తాము తయారు చేయలేదని, మరో వర్శిటీ నుంచి వచ్చిందని కాలేజ్ ఉన్నతాధికారులు వ్యాఖ్యానించడం గమనార్హం.