'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ లో పాయల్ చేయడం లేదట
- వంశీకృష్ణ నుంచి ఇంట్రెస్టింగ్ బయోపిక్
- 'టైగర్ నాగేశ్వరరావు'గా బెల్లంకొండ
- స్టార్ హీరోయిన్ తో సంప్రదింపులు
1980 - 90 దశకాల్లో స్టూవర్టుపురం' గజదొంగగా 'టైగర్ నాగేశ్వరరావు' ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో ఈ బయోపిక్ సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఇంతకుముందు వంశీకృష్ణ దర్శకత్వం వహించిన 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' ఫరవాలేదనిపించుకుంది. 'టైగర్ నాగేశ్వర రావు' సినిమాలో కథానాయికగా ఇంకా ఎవరినీ తీసుకోలేదట. ఒక స్టార్ హీరోయిన్ తో సంప్రదింపులు జరుపుతున్నటుగా చెప్పుకుంటున్నారు. ఆ హీరోయిన్ ఎవరనేది త్వరలోనే తెలియనుంది.