జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ను నమ్మేదెవరు?: రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
- జాతీయనేతలు కేసీఆర్ తో కలవరు
- 16 సీట్లతో కేసీఆర్ ఏంచేస్తారు?
- కాంగ్రెస్ కు 150 స్థానాలు గ్యారంటీ
"కాంగ్రెస్ 150 సీట్లు గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. 150 సీట్లుగెలిచే వాళ్లకు ఓటేస్తే వృథా అవుతుందన్నప్పుడు 16 సీట్లు వచ్చేవాళ్లకు ఎలా ఓటేస్తారు? ఆ 16 సీట్లు ఉండి ఐదేళ్ల పాటు కేసీఆర్ ఏమీచేయలేడు. నాయకుడన్నవాడు గెలుపోటములతో పనిలేకుండా ప్రజల కోసం పనిచేయాలి. ఎక్కడైనా గానీ ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. ఇప్పుడు ప్రజల తరఫున నిలబడాలని పార్టీ ఆదేశించింది. అందుకే మల్కాజ్ గిరిలో పోటీచేస్తున్నాను. ఇవి దేశప్రధానిని నిర్ణయించే ఎన్నికలు" అంటూ వ్యాఖ్యానించారు.