ఈ ఎన్నికల్లో టీడీపీ రూ.6 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెడుతోంది: జీవీఎల్ ఆరోపణలు

  • ఏపీలో టీడీపీ ధన రాజకీయం చేస్తోంది
  • కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
  • బ్యాంక్ లావాదేవీలపై ఆర్బీఐ పర్యవేక్షణ ఉండాలి
ఏపీలో టీడీపీ చేస్తున్న ధన రాజకీయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రూ.70 కోట్లకు పైగా ఖర్చు పెట్టగలిగే వారిని టీడీపీ ఎంపీ అభ్యర్థులుగా, రూ.25 కోట్లకు పైగా ఖర్చు పెట్టగలిగేవారిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెట్టిందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ రూ.6 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెడుతోందని, ఎన్నికల సమయంలో బ్యాంక్ లావాదేవీలపై ఆర్బీఐ పర్యవేక్షణ ఉండాలని ఈసీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ నెల 26న ఏపీ బీజేపీ మేనిఫెస్టో విడుదల చేస్తున్నట్టు జీవీఎల్ తెలిపారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
BJP
mp
gvl

More Telugu News