కేసీఆర్ సహకారంతో వైసీపీ విర్రవీగుతోంది: సీఎం చంద్రబాబు

  • రాష్ట్రానికి అతిపెద్ద సమస్య జగనే
  • లక్షల సంఖ్యలో ఫారం-7 అక్రమంగా దరఖాస్తు చేశారు
  • తప్పుడు విధానాలతో గెలవాలని వైసీపీ వ్యూహాలు
కేసీఆర్ సహకారంతో వైసీపీ విర్రవీగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. తమ పార్టీ నేతలతో ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసీఆర్ చేస్తున్న పనులు తప్పని ఇప్పటికే స్పష్టం చేశామని, రాష్ట్రానికి అతిపెద్ద సమస్య జగనే అని పార్టీ నేతలతో చంద్రబాబు అన్నట్టు సమాచారం.

ఏపీకి తుపానులు, ఆర్థిక కష్టాల కంటే జగనే పెద్ద సమస్య అని, లక్షల సంఖ్యలో ఫారం-7 అక్రమంగా దరఖాస్తు చేశారని, కేసులు పెట్టాలని సూచించారు. 85 శాతం ఫారం-7 దరఖాస్తులు నకిలీవని అధికారులు తేల్చారని, నకిలీ దరఖాస్తుల వెనుక వైసీపీ, బీజేపీ నేతల ప్రమేయం ఉందని, తప్పుడు విధానాలతో గెలుపొందడానికి వైసీపీ వ్యూహాలు రచిస్తోందని తన నేతలతో చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.
Go Back to Shorts
KCR
Chandrababu
Jagan
TRS
Telugudesam
YSRCP

More Telugu News