మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అడుగులు అటు వైపేనా?
- మళ్లీ వైసీపీలో చేరుతారన్న ప్రచారం
- నేడో, రేపో టీడీపీకి గుడ్‌బై చెప్పే అవకాశం
- ఇప్పటికే కాపు కార్పొరేషన్ పదవికి రాజీనామా
ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజుతో ఈ మేరకు చర్చించారని సమాచారం. టీడీపీకి రాజీనామా చేసి ఆయన రేపు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి.